TDP MLA | టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు.. వీడియోలను బహిర్గతం చేసిన బాధితురాలు
TDP MLA | సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA ) కోనేటి ఆదిమూలం(Koneti Adimulam) తనపై లైంగిక వేధింపులకు గురిచేశారని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది.
అమరావతి : సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA ) కోనేటి ఆదిమూలం(Koneti Adimulam) తనపై లైంగిక వేధింపులకు (Sexually harassment) గురిచేశారని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను సైతం ఆమె విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో భర్తతో కలిసి గురువారం వివరాలు వెల్లడించింది.
తిరుపతిలోని బీమాస్ హోటల్(Hotel) లో తనపై లైంగిక దాడి చేశాడని వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు(Chandra Babu) తో పాటు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని ఆందోళన వ్యక్తం చేసింది. తాము కూడా టీడీపీకి చెందిన వారిమేనని ఆ దృష్ట్యా పార్టీ కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారని వెల్లడించింది.
అలా పరిచయమైన తరువాత ఆదిమూలం తన ఫోన్ నెంబర్ తీసుకుని పదేపదే కాల్స్ చేసేవాడని, తిరుపతిలోని భీమాస్ హోటల్ రూమ్ నెంబర్ 109 లోకి రమ్మని చెప్పాడని తెలిపింది. అక్కడ తనను బెదిరించి తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. అలా తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నానని వివరించింది.
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్
ఎమ్మెల్యే దురాగతాల సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే వందసార్లు కాల్ చేశాడని, రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడని, రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడని తీవ్రంగా ఆరోపించింది. అందమైన అమ్మాయి కనబడితే చాలు తనతో ఉండాల్సిందేనని అలా ఎంతో మందిని వేధించాడని వెల్లడించింది.
తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ ఎమ్మెల్యే నీచ చర్యలకు అడ్డా అని తెలిపింది. ఇలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడని, అతని నుంచి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలని బాధితురాలు వేడుకొంది.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారని సత్యవేడు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ఆరోపించారు.#Sathyavedu #TDP #Harassment #AndhraPradesh #Tupaki pic.twitter.com/R9OCUlvCri
— Tupaki (@tupaki_official) September 5, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

