వచ్చే నెల 3 నుంచి కల్యాణ వేంకటేశ్వరుడి సాక్షాత్కార వైభవోత్సవాలు
శ్రీనివాసమంగాపురంలో కొలువై ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు వచ్చే నెల 3 నుంచి జరుగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం...
తిరుపతి: శ్రీనివాసమంగాపురంలో కొలువై ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు వచ్చే నెల 3 నుంచి జరుగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, జూలై 3 నుంచి 5 వరకు వైభవంగా సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జూలై 3, 4, 5వ తేదీలలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనుననారు. శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి జూలై 3న పెద్దశేష వాహనంపై, జూలై 4న హనుమంత వాహనంపై, జూలై 5న గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జూలై 6న పార్వేట ఉత్సవం
శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 6న పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం చేపడతారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

