Kalki 2898 AD | కల్కి సినిమా టికెట్ ధరలు పెంపుపై స్టే నిరాకరణ.. ఇంకా ఏపీ హైకోర్టు ఏమన్నదంటే ?
Kalki 2898 AD | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కల్కి సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అమరావతి : ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కల్కి సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు (AP High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాష్ హీరోగా నాగ్అశ్విని దర్శకత్వంలో అశ్వినిదత్ నిర్మాతగా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) చిత్రం ఇటీవల విడుదలై రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అనుమతి 14 రోజుల పాటు పొడగించడాన్ని సవాలు చేస్తూ ఒకరు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆదేశాలపై స్టే (Stay) ఇవ్వాలని కోరగా బుధవారం కోర్టు విచారించి స్టేకు నిరాకరించింది.
అయితే కల్కి సినిమానే కాకుండా ప్రత్యేకంగా ఒక్కో సినిమాకి టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకునే అధికారం అసలు ప్రభుత్వానికి ఉందా అని అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈసీఐఎల్ రూ.133.74 కోట్ల డివిడెండ్
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

