ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కొనసాగుతున్న ఆందోళనలు, దీక్షలు
జిల్లా విభజన అంశంపై అభ్యంతరాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమా ఆధ్వర్యంలో రీలేదీక్షలు...
అమరావతి: ఏపీలో జిల్లా విభజన అంశంపై అభ్యంతరాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్లా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని పలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కార్పెంటర్స్ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద దీక్షలో పాల్గొన్నారు. అటు ఎర్రగొండపాలెంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కనిగిరిలో స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలోకి వామపక్ష నేతలు బలవంతంగా దూసుకుపోయి మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అద్దంకి మండలాన్ని ప్రకాశంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజాసంఘాలు ర్యాలీ నిర్వహించాయి. వీరికి టీడీపీ, వాపపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు.
మరోవైపు కృష్ణా జిల్లాలోని మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో రీలేదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం మెడలు వంచైనా మైలవరం డివిజన్‌ను సాధిస్తామని ఉమా స్పష్టం చేశారు. కడప జిల్లాలోని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ, లేనిపక్షంలో బాధ్యత వహిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ నేత చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గౌతమికి 1600 వినతులను అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

