Madanapalle Incident | మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి పీఏ .. కీలక దస్త్రాలు స్వాధీనం
Madanapalle Incident | ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) వ్యక్తిగత సహాయకుడు శశిధర్(PA Shasidhar) ను ఏపీ పోలీసులు(Police) హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని నాలుగు పెట్టెల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈనెల 21న రాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపి నివేదికను అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో మూడు శాఖలకు చెందిన అధికారులు వారం రోజులుగా కేసును ఛేదించేందుకు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు.
దీంట్లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్(Hyderabad) లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో మాజీ ఎమ్మెల్యే ఇంట్లో నివాసముంటున్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడైన శశిధర్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 8 గంటల పాటు సోదాలు చేసి, విచారించి అతడి ఇంట్లో ఉన్న నాలుగు పెట్టెల దస్త్రాలను వెంట తీసుకొని వెళ్లారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

