రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు.. ఎస్ఐపై దాడి..గాయాలు
attacked | పేకాటరాయుళ్లను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఎదురుదాడి చేసి ఎస్సైను గాయపరిచిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది
అమరావతి : పేకాటరాయుళ్లను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఎదురుదాడి చేసి ఎస్సైను గాయపరిచిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం ఉల్లిపాయ జట్టుకు చెందిన సుమారు 50 మంది కార్మికులు వేడుకలో పాల్గొని ముత్యాలమ్మ గుడి వద్ద పేకాటాడుతున్నారు. సమాచారం తెలుసుకున్నా తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై శ్రీనివాసరావు మఫ్టీలో సంఘటన స్థలానికి చేరుకుని పేకాటాడుతున్న స్థావరంపై దాడి చేశారు. నగదును స్వాధీనం చేసుకుంటున్న సమయంలో రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు దొంగా..దొంగా అంటూ రెచ్చిపోయి ఎస్సైతో పాటు అక్కడికి వచ్చిన కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపర్చారు.
తాను ఎస్సైను అని చెబుతున్నా వినకుండా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. వీరిలో కొంతమంది మద్యం సేవించి ఉన్నారు. విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పోలీసులపై దాడి చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు 24 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ద్విచక్రవాహనాలు, సెల్ ఫోన్లు, రూ. 74 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

