AP CM : సీఎం జగన్మోహన్రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే ఓర్వలేని చంద్రబాబు: మంత్రి కొడాలి నాని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ 99 శాతం జడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీలు గెలిచినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ 99 శాతం జడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీలు గెలిచినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండగా చంద్రబాబు, కుట్రలు పన్ని అప్పటి ఎన్నికల కమిషనర్‌తో వాయిదా వేయించి పారిపోయారని ఎద్దేవా చేశారు.
కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చాక మార్చిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే.. టీడీపీకి భంగపాటు తప్పదని తెలిసి లెక్కింపు ఆపేశారని విమర్శలు గుప్పించారు. 800 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచారని.. వాళ్లందరూ చంద్రబాబుని ధిక్కరించినవాళ్లా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ గెలిచిన వాళ్లలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోండి అని సూచించారు. ప్రతిపక్షం ఉనికి కోల్పోయిందని చంద్రబాబు ఒప్పుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

