Anna Konidela | సింగపూర్‌లో పవన్ కల్యాణ్ సతీమణి మాస్టర్స్ .. అన్నా కొణిదెల స్టడీ హిస్టరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Anna Konidela | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తన పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.
Anna Konidela | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తన పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానంలో ఆమె పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో అట్టహాసంగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో పట్టాను అందుకున్నారు. ఈ వేడుకకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ ఒక ప్రకటన చేసింది. దీంతో పాటు తన భార్య అన్నాతో పవన్ కల్యాణ్ దిగిన సెల్ఫీని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అన్నా లెజినోవాకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. గతంలో ఆమె రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్‌లో హానర్స్ పట్టా పందారు. ఆసియా దేశాల చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు. ఈ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్‌గా ఉంది. సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో ఉండగానే మూడు భాషలు నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయి స్టడీస్‌లో మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.
సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన శ్రీమతి అనా కొణిదెల గారు pic.twitter.com/wDOUe3jotC
— JanaSena Party (@JanaSenaParty) July 20, 2024
అన్నా కొణిదెలగా మారిన పేరు!
ఇప్పటివరకు పవన్ కల్యాణ్ సతీమణి పేరు అన్నా లెజినోవా అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆమె తన పేరును అన్నా కొణిదెలగా మార్చుకున్నారని తెలుస్తోంది. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి ఆమె పొందిన మాస్టర్స్ పట్టాలో అన్నా పూర్తి పేరు అన్నా కొణిదెలగానే ఉంది. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నా కొణిదెల గారికి కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

