చంద్రబాబుకు నోటీసుల జారీపై కొనసాగుతున్న సస్పెన్షన్
చంద్రబాబుకు నోటీసులపై కొనసాగుతున్న సస్పెన్షన్ | ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చే అంశంపై సస్పెన్షన్ కొనసాగుతున్నది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చే అంశంపై సస్పెన్షన్ కొనసాగుతున్నది. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఉదయం కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన పోలీసులకు నగరానికి చేరేలోపే నోటీసులు ఇవ్వవద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కర్నూల్ పోలీసులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. స్పీకర్ ద్వారా ఆయనకు నోటీసులు అందించాలని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్లు వినికిడి.
నోటీసుల జారీ విషయంలో న్యాయ నిపుణుల సూచనలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్ ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేశారని ఆయనపై న్యాయవాది సుబ్బయ్య కర్నూల్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్లతోపాటు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టం సెక్షన్-4 కింద కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

