హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్‌కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పటిరకు సీఎస్‌గా ఉన్న జవహర్ రెడ్డి(Jawahar reddy) గురువారం సెలవుపై వెళ్లగా అతడిని బదిలీ చేసింది. ఆయన జూన్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నీరభ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.