Tirumala News : శ్రీకృష్ణస్వామికి నూతన యజ్ఞోపవీతం ధారణ
Tirumala News | శ్రావణ ఉపకర్మ పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారికి ఆదివారం నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించారు.

తిరుమల : శ్రావణ ఉపకర్మ పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారికి ఆదివారం నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. శ్రావణ పౌర్ణమినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తిని శ్రీవరాహ స్వామి ఆలయం ఎదుట ఉన్న స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నూతన యజ్ఞోపవీతం (పవిత్రమైన దారం) ధరింపజేశారు. అనంతరం శ్రీవారి ఆలయానికి వెంచేపు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

