Nara lokesh | టీడీపీ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. నేను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకొని నెల దాటింది. అటు తెలంగాణతోపాటు అండమాన్‌లో ఉన్న తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా మనం జయప్రదం చేద్దాం. కలిసి కట్టుగా పనిచేద్దాం.. గ్రామస్థాయి నుంచి మళ్లీ తెలుగు దేశం పార్టీకి పునర్వైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు.
కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా టీడీపీని బలోపేతం చేద్దామంటూ కామెంట్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అండమాన్, తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేసే బాధ్యత నాది
– నారా లోకేష్ pic.twitter.com/M528caNPO3
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026