మహిళా దినోత్సవం రోజున వైసీపీ నేత రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై చెలరేగిపోయారు. పంచ్ డైలాగులతో బాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు టార్గెట్‌గా రోజా వేసిన సినిమా పంచ్‌లు వేదికపైనున్న ఏపీ సీఎం జగన్‌ను ఉత్సాహపరచడమే కాక వైసీపీ అభిమానుల్లో ఫుల్ జోస్ పెంచాయి. పంచ్ డైలాగులతో చంద్రబాబును ఓ ఆటాడుకున్నారు రోజా. చంద్రబాబు ఎక్కడా.. జగనన్న ఎక్కడా.. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాల కృష్ణ డైలాగుతో జోష్ నింపారు.
మహిళల జీవితాలను నాశనం చేసిన కాలకేయుడు చంద్రబాబు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన కారణ జన్ముడు మన జగనన్న… చంద్రబాబు చీటర్.. జగనన్న లీడర్.. చంద్రబాబు మోసగాడు.. జగనన్న మొనగాడు.. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ మాటల తూటాలను పేల్చింది . రోజా మాటల విరుపులకు టీడీపీ నుంచి గట్టి కౌంటరే ఇచ్చారు. మహిళా దినోత్సవ వేదికను రోజా జబర్దస్త్ వేదికగా మార్చిందంటూ టీడీపీ నాయకులు విమర్శించారు.