సంగం బరాజ్‌కు మేకపాటి గౌతంరెడ్డి పేరు: ఏపీ సీఎం జగన్
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని, ఆయన మృతి తనతోపాటు తన పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్ది చెప్పారు. గౌతమ్‌రెడ్డికి నివాళిగా సంగం బరాజ్‌కు...
అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని, ఆయన మృతి తనతోపాటు తన పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్ది చెప్పారు. ఎంతో సౌమ్యుడైన గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం తనను ఎంతగానో కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డికి నివాళిగా సంగం బరాజ్‌కు ఆయన పేరు పెడతామని అసెంబ్లీలో జగన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు గౌతమ్‌రెడ్డి సేవలను, ఆయన మంచితనాన్ని, తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
చివరగా మాట్లాడిన సీఎం జగన్.. గౌతమ్‌రెడ్డి తనకు చిన్ననాటి నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరంగా ఉన్నదన్నారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించారని కొనియాడారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు.
పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి చేశారని, గౌతమ్‌రెడ్డి మనతో లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బరాజ్ పనులను 6 వారాల్లో పూర్తి చేసి, ఆ బరాజ్‌కు మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్‌గా నామకరణం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

