Tirumala | తిరుమలలో లైసెన్స్ ఫీజు చెల్లించని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ రద్దు
Tirumala | లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమలలో తొమ్మిది పెద్ద హోటళ్లలో ఒకటైన బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ ను టీటీడీ రద్దు చేసింది.
తిరుమల : లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమల (Tirumala ) లో తొమ్మిది పెద్ద హోటళ్లలో ఒకటైన బాలాజీ భవన్ హోటల్ (Hotel) లైసెన్స్ ను టీటీడీ(TTD) రద్దు చేసింది. కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న ఈ హోటల్ చెల్లించవలసిన లైసెన్స్ ఫీజు(Licence Fees) రూ.76 లక్షలు బకాయి పడింది.
గత నెలలో ఫీజు చెల్లించాలని సదరు హోటల్‌కు తుది నోటీసులు జారీ చేశారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా, లైసెన్సు ఫీజు చెల్లించనందుకు హోటల్ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీ రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం హోటల్‌ను స్వాధీనం చేసుకుంది .
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లు అన్నీకూడా భక్తులతో నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 67,223 మంది భక్తులు దర్శించుకోగా 24,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు వచ్చిందని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

