విద్యార్థిని కొట్టి కాలితో తన్నిన లెక్చరర్‌పై సస్పెన్షన్ వేటు
విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పాటు అతడిని కాలితో తన్నిన లెక్చరర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం లెక్చరర్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో...
ఎన్టీఆర్ జిల్లా : విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పాటు అతడిని కాలితో తన్నిన లెక్చరర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం లెక్చరర్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన విజయవాడ బెంజి సర్కిల్లోని భాస్కర్ భవన్ క్యాంపస్‌లో చోటుచేసుకున్నది. విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పాటు కాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం సదరు లెక్చరర్‌ను విధుల నుంచి తప్పించింది.
తరగతిలో తోటి విద్యార్థితో మాట్లాడిన ఓ విద్యార్థిని శ్రీ చైతన్య కాలేజీ లెక్చరర్ అందరి ముందే చెంపపై వాయించాడు. అంతటితో ఊరుకోకుండా కాలితో తన్నాడు. ఈ ఘటనను తరగతిలోని మరో విద్యార్థి వీడియో తీసి తల్లిదండ్రులకు పంపడంతో గొడవ పెద్దగా మారింది. శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనను జిల్లా విద్యాశాఖ, చైల్డ్‌లైన్ అధికారులతో పాటు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంటర్ బోర్డు స్థానిక ఇన్స్పెక్టర్ రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి ఘటనపై ఆరా తీశారు.
సదరు విద్యార్థి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడని, పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో కోపం వచ్చి కొట్టినట్లు లెక్చరర్ వివరించారు. అయితే ఈ వార్డులో ఫోన్ తీసుకెళ్లేందుకు విద్యార్థులకు అనుమతి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అలాంటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినే అవకాశమే ఉండదని వారు వాదిస్తున్నారు. కట్టడి పేరుతో విద్యార్థులను దండించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ మేరకు సదరు లెక్చరర్‌ను సస్పెండ్ చేసినట్లు ఆర్ఐఓ తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

