Kodali Nani | చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నాని ఘాటు విమర్శలు
Kodali Nani | సినీనటుడు చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ( Kodali Nani ) ఘాటుగా సమాదానమిచ్చారు.
అమరావతి : సినీనటుడు చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ( Kodali Nani ) ఘాటుగా సమాదానమిచ్చారు. సినీ పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారని విమర్శించారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న కొందరు పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహా ఇస్తున్నారని దుయ్యబట్టారు.
పకోడిగాళ్లు సలహాలు తన వాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ చిరంజీవి (Chiranjeev) కి సూచించారు. డ్యాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందాం, రాజకీయాలు ఎందుకని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సూచించవచ్చు కదా అంటూ పరోక్షంగా వ్యాఖ్యనించారు .
వాల్తేరు వీరయ్య (Valtair Veeraiah) 200 రోజుల ఫంక్షన్లో చిరంజీవి మంగళవారం ప్రభుత్వంపై పరోక్ష పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలోని కొందరు పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా సినిమా పరిశ్రమపై పడడం శోచనీయమని అన్నారు. రాష్ట్రంలో అసలు విషయాలు వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారికి కడుపు నింపే విషయం గురించి ఆలోచించాలని సూచించారు.
ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టిని సారించాలని, పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని చిరంజీవి ప్రభుత్వానికి పలు సూచనాలు చేశారు. పవన్ కల్యాణ్ బ్రో(Bro Movie) రెమ్యునరేషన్‌పై ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati) లేవనెత్తిన అంశాలపై సైతం చిరంజీవి కౌంటర్ ఇచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

