Mudragada | పేరు మార్చుకున్నా ఆగని వేధింపులు.. ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయండని ముద్రగడ ఆవేదన
Mudragada | పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని సవాలు విసిరి బొక్కబోర్లాపడటంతో ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా ప్రజల ముందు పెట్టారు.
Mudragada | పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని సవాలు విసిరి బొక్కబోర్లాపడటంతో ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా ప్రజల ముందు పెట్టారు. అయినప్పటికీ ముద్రగడపై వేధింపులు ఆగడం లేదు. సోషల్‌మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ తన ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్‌ను విజ్ఞప్తి చేశారు. జన సైనికులు తన మీద బూతులతో దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని జన సైనికులను మందలించాలని సూచించారు. బూతులు తిట్టడం కంటే మా ఫ్యామిలీని ఒకేసారి చంపేయండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. దాడులు జరగకుండా టీడీపీ నేతలకు కూడా పవన్ కల్యాణ్ సూచించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

