Kesineni Nani | కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
Kesineni Nani | వైఎస్సార్సీపీ నాయకుడు కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు నాని సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని నాని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Kesineni Nani | అమరావతి : వైఎస్సార్సీపీ నాయకుడు కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు నాని సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని నాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేశినేని నాని పోటీ చేశారు. కానీ సొంత తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో నాని ఓటమి చవిచూశారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననని నాని వెల్లడించారు.
నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపూర్వమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారి తిరుగులేని మద్దతుకు నా కృతజ్ఞతలు. నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా.. విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంటుంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు’’ అంటూ కేశినేని నాని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన సోమవారం స్పందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

