Srisailam Temple | శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
Srisailam Temple | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సిద్ధమవుతున్నది. నవంబర్ 2 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు వేడుకలు జరుగనున్నాయి. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది.
Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సిద్ధమవుతున్నది. నవంబర్ 2 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు వేడుకలు జరుగనున్నాయి. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఇన్చార్జి ఈవో ఈ చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేశసదన్, అన్నప్రసాద వితరణ, భారత్ పెట్రోల్ బంక్, మల్లికార్జున సదన్ ఎదుట ఉన్న పార్కింగ్ ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన వితరణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించారు. అన్నప్రసాద వితరణలో ఏయే రోజు ఏం పెడుతున్నారో తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన కూరగాయలను తెప్పించాలని చెప్పారు. ఆహార పదార్థాలను వృథా చేయకుండా చూడాలన్నారు. అన్నదాన వితరణ కేంద్రంలో మరమ్మతులు ఉంటే ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అధికారులు ప్రతి హాల్లో అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్‌కోడ్ పాటించాల్సిందేనన్నారు.
సిబ్బంది అంతా భక్తులతో మర్యాదగా మెదలాలని సూచించారు. భక్తులకు వసతి గదులు కేటాయించే సందర్భంలో ఆధార్‌కార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఆలస్యం లేకుండా గదులు, ఖాళీ అయిన వెంటనే గదులను శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఏ ఒక్క భక్తుడి నుంచి ఫిర్యాదు లేకుండా సమర్థవంతంగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. గణేశ్ సదన్ వద్ద మినీ కల్యాణకట్టను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భారత్ పెట్రోల్ బంకు వద్ద ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ (ఐసీ) పీవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

