Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. బీజేపీ జనసేనలకూ బాబు క్యాబినెట్లో చోటు..?
Pawan Kalyan | జనసేన వ్యవస్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు టీడీపీ అధినేత - ఏపీ సీఎం డిజిగ్నేట్ చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తున్నది.
Pawan Kalyan | జనసేన వ్యవస్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు టీడీపీ అధినేత – ఏపీ సీఎం డిజిగ్నేట్ చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలుస్తున్నది. చంద్రబాబు.. తమ కూటమి జనసేన, బీజేపీలకు ఐదు లేక ఆరు మంత్రి పదవులు ఇవ్వనున్నారని టీడీపీ వర్గాలు చెప్పాయి.
పీఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పవన్ కల్యాణ్.. మెగా స్టార్ చిరంజీవికి సోదరుడు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. కానీ తదుపరి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. కాగా, 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్.. నాటి ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు బీజేపీ, టీడీపీలకు బయట నుంచి మద్దతు పలికారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయలేదు. కానీ ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించారు.
పవన్ కల్యాణ్‌తోపాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ కూడా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినా, రాజోల్ మినహా అన్ని సీట్లలోనూ ఓటమిపాలయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలతో ఎన్డీఏ ఏర్పాటు కావడంలో కీలకపాత్ర పోషించారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తున్నది. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన నారా లోకేశ్.. 2014 – 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

