DSC | హెరిటజ్లో పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి ఆగ్రహం
DSC | ఏపీలోని(AP) కూటమి ప్రభుత్వం పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు(Teacher jobs sold) అమ్మేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా( Jakkampudi Raja) ఆగ్రహం వ్యక్తం చేశారు.
DSC | ఏపీలోని(AP) కూటమి ప్రభుత్వం పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు(Teacher jobs sold) అమ్మేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా( Jakkampudi Raja) ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..డీఎస్సీలో అక్రమాలు గురించి గతం నుంచి చెబుతూనే వచ్చామని.. మూడున్నర లక్షల మంది అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇంత జరిగినా నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి రావటం లేదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ హయాంలో కానీ విని ఎరుగని రీతిలో గత ప్రభుత్వ హయాంలో ఒకటిన్నర లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ నిర్వహించాం. కానీ, కూటమి పాలనలో హెరిటజ్లో పాలు, పెరుగు అమ్మినట్టు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రావటం విద్యార్థులకు శాపమన్నారు. టెట్కి, డీఎస్సీకి ఒకరినే కన్వీనర్గా పెట్టడం దగ్గర నుంచి.. సంతలో బర్రెలు అమ్మినట్టు టీడీపీ నేతలు ఉద్యోగాలు అమ్మేసేంతవరకు ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సీబిఐ విచారణ జరిపించండి అని జక్కంపూడి డిమాండ్ చేశారు.
ఏపీలో కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ వ్యవహారంపై ఎందుకు సీబిఐ విచారణ జరపటం లేదు. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో బయట పడుతుంది. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఉద్దేశంతోనే ధైర్యం చేయడం లేదన్నారు. కనీసం గ్రౌండ్లో అడుగుపెట్టని వారికి సైతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారని ఆరోపించారు. డబ్బు కోసం అక్రమ సంపాదన కోసం ఎటువంటి నీచమైన పని చేయడానికైనా ప్రభుత్వం దిగజారి పోతుంది. ఆడియో టేపులు బయటకు వచ్చినా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు. లోకేష్ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ఈ వ్యవహారంలో కోర్టులు కూడా జోక్యం కల్పించుకోవాలని జక్కంపూడి రాజా పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- DSC
- jakkampudi raja
- tdp
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

