ఏపీలో ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Supplementary |ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి కార్యాలయంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ,
అమరావతి: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి కార్యాలయంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు జూన్25 నుంచి జులై 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12 వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తామని వివరించారు.
ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా విద్యార్థులు 72శాతం మంది ఉత్తీర్ణత సాధించగా కడప జిల్లా విద్యార్థులు అత్యల్పంగా 50శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మొత్తం 8లక్షల 69వేల 059 మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4లక్షల 45వేల 604 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 4లక్షల 23వేల 458 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వివరించారు.
ఒకేషనల్ కోర్సులో 72వేల 299 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. మొదటి సంవత్సరంలో 2లక్షల 41వేల 591 మంది ఉత్ణీర్ణుల య్యారని వివరించారు. ఉత్తీర్ణత 54శాతం కాగా రెండవ సంవత్సరంలో 2లక్షల 58వేల 449 మంది పాసయ్యారని తెలిపారు. 61శాతం మంది పాసయ్యారని వివరించారు. మొదటి సంవత్సరంలో బాలురు 49శాతం, బాలికలు 60శాతం, రెండో సంవత్సరంలో 54శాతం బాలురు, బాలికలు 68శాతం పాసయ్యారని మంత్రి వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

