ఏపీలో భారీ వర్షాలు..జల దిగ్బంధంలో లంక గ్రామాలు
Heavy rains|రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం
అమరావతి : ఏపీలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 15.10 అడుగులకు చేరగా ముందు జాగ్రత్తగా అధికారులు 15 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో వరద నీటి ప్రవాహంతో కొన్ని మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. వరద నీరు రహదారులు, కాజ్‌వేలపై పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం శివాయిలంక, చినకందాల పాలెం, వాడ్రేవుపల్లి, నాగుల్లంక గ్రామాల్లోకి వరదనీరు చేరాయి. అయినవిల్లి లంక కాజ్వే పూర్తిగా నీట మునిగిపోవడంతో నాలుగు లంకగ్రామాల ప్రజలు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ కర్ణాటకలోని పల్నాడు ప్రాంతమైన సీమొగ్గ, ఆరావళి పర్వతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయం ఉప్పొంగుతోంది. వరదప్రవాహం అధికం కావడంతో అధికారులు జలాశయం 20 గేట్లు ఎత్తివేసి 39,243 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. నది తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులు కోరుతున్నారు.
కాగా పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి కొత్తపేటలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కుప్పకూలింది. ఇంటి యాజమాని శిరాసాల ఏడుకొండలు ఉదయాన్నే టీ తాగటానికి బయటకు వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 34.3 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అప్రమత్తమైన అధికారులు 48 గేట్లను ఎత్తి దిగువకు 12.84 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. పోలీస్ చెక్ పోస్టును వరద నీరు చుట్టుముట్టింది. ప్రాజెక్టు ప్రధాన రహదారిపై వరద నీటిమట్టం 14 అడుగుల చేరడంతో ప్రాజెక్టులోకి రాకపోకలు నిలిపివేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

