ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉధృతి
ప్రకాశం బ్యారేజీ | కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి బ్యారేజీకి 2.31 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.

అమరావతి : కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి బ్యారేజీకి 2.31 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 70 గేట్లను ఎత్తి 2 లక్షల 22 వేల క్యూసెక్కులను సముద్రంలో విడుదల చేస్తున్నారు. కాలువలకు 9,689 క్యూసెక్కులు వదులుతున్నారు.
పులిచింతల క్రస్టుగేట్లు మూసివేత..
పులిచింతలకు ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. కేవలం 8 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. విద్యుదుత్పత్తి కోసం 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 43.92 టీఎంసీలుగా ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

