Good news | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. పారదర్శకంగా దర్శన, వసతికి టీటీడీ చర్యలు
Good news | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది .
తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ(TTD) చర్యలు చేపట్టింది . ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్‌లైన్(Offline) , ఆన్లైన్(Online) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
గత ఏడాది కాలంగా ఆన్లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి) , ఆఫ్‌లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ జరిపిన విచారణలో ఇందులో ఓకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ (Bulk booking) పొందినట్లు విచారణలో గుర్తించారు.
ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు
తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు పొందినట్లు , ఆన్లైన్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 807 వసతి బుకింగ్‌లు, ఆన్లైన్ ఒకే ఇమెయిల్ ఐడిని ఉపయోగించి 926 వసతి బుకింగ్‌లు చేసినట్లు గుర్తించిన అధికారులు వాటిపై చర్యలకు ఉపక్రమించారు. అదేవిధంగా ఒకే మొబైల్ నంబర్ని ఉపయోగించి ఒక సంవత్సరంలో 1,279 డిప్ రిజిస్ట్రేషన్లు,ఒకే మెయిల్ ఐడీని ఉపయోగించి ఒక సంవత్సరంలో 48 డిప్ రిజిస్ట్రేషన్లు,ఒకే ఐడి ప్రూఫ్‌ని ఉపయోగించి 14 ఎస్ ఎస్ డి సర్వ సర్వదర్శనం టోకెన్లు పొందారని అధికారులు తెలిపారు.
బల్క్ బుకింగ్‌లకు ఉపయోగించే మొబైల్ నంబర్లు, మెయిల్లు , ఐడి ప్రూఫ్‌లను రద్దు చేశారు. ఫేక్ మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడిలు, ఐడి ప్రూఫ్ లు ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబడవని, బుకింగ్ రద్దు అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు తెలియజేస్తామని టీటీడీ వెల్లడించింది.
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్..
నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (Facial recognition System)ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తుందని అధికారులు తెలిపారు. దళారులు ఫేక్ మొబైల్, మెయిల్ ఐడి ప్రూఫ్‌లను ఉపయోగించి చేసిన బుకింగ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతోందని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

