మేడే రోజున ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైకులను అందించేందుకు సిద్ధమైంది. అలాగే బస్ స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) కార్మిక దినోత్సవం వేళ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తొలుత ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైకులను అందించేందుకు సిద్ధమైంది. సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ.. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. అలాగే బస్ స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆర్టీసీ.. ఆ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు నాణ్యమైన ఎలక్ట్రిక్ బైక్‌లను అందించేందుకు నెడ్ క్యాప్ ముందుకొచ్చింది. నెడ్ క్యాప్ గుర్తించిన సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను అందించనున్నారు. ఒక్కో ఎలక్ట్రిక్ వాహనం ధర లక్ష రూపాయలకు పైగా ఉండగా.. ప్రతి నెలా ఈఎంఐ కింద రూ.2,000, రూ.2,500 గా చెల్లించవచ్చని, ఎలాంటి ముందస్తు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. 24 నెలల నుంచి 60 నెలల వరకు ఈఎంఐ అవకాశం కల్పిస్తున్నారు. ఎంపిక చేసుకునే వాహనాన్ని బట్టి దాని వేగం ఆధారపడి ఉంటుందని, వాహన కనీస వేగం 40 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగం ఉండనున్నదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

