రేపటి నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
Srirama navami| అమరావతి : కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి
తిరుపతి : అమరావతి : కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 9న శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు వ్యాసాభిషేకం,ఆరాధన, అర్చన నిర్వహిస్తారని, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారని వివరించారు. ఏప్రిల్ 10న ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి, కవి సమ్మేళనం, శేష వాహనసేవ నిర్వహిస్తారని తెలిపారు.
11న వేణుగాన అలంకారం, హంస వాహనంపై ఊరేగింపు , 12న వటపత్రశాయి అలంకారంలో సింహవాహనంపై ఊరేగిస్తారని వివరించారు. నవనీతకృష్ణ అలంకారం, హనుమత్సేవ, 14న మోహినీ అలంకారం, గరుడసేవ, 15 న శివధనుర్భంగాలంకారం, శ్రీ సీతారాముల కల్యాణం , గజవాహనం. 16న రథోత్సవం, 17 కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనంపై స్వామివారు ఊరేగిస్తారని అధికారులు తెలిపారు. 18న చక్రస్నానం, ధ్వజావరోహణం అర్చకులు నిర్వహిస్తారని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

