అనంతపురంలో విషాదం.. ఆక్సిజన్ అందక ఐదుగురు కొవిడ్ రోగులు మృతి
ఐదుగురు కొవిడ్ రోగులు మృతి | ఆక్సిజన్ కొరత కారణంగా కొవిడ్ బారినపడిన చాలామంది అత్యవసర సమయంలో ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది.

అమరావతి : ఆక్సిజన్ కొరత కారణంగా కొవిడ్ బారినపడిన చాలామంది అత్యవసర సమయంలో ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది.
కొవిడ్ బారినపడి స్థానిక క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా రోగులు మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆక్సిజన్ కొరత కారణంగానే చనిపోయినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చంద్రుడు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి సైతం దవాఖాన వద్దకు చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఇటీవల కర్నూల్, విజయనగరం జిల్లాల్లోనూ ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ఘటన జరుగుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

