Peddireddy Ramachandra Reddy | మాజీ మంత్రి పెద్దిరెడ్డికి భారీ షాక్.. పార్టీని వీడిన ఆయన ప్రధాన అనుచరుడు
Peddireddy Ramachandra Reddy | ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జడ్పీటీసీ పదవికి ఆయన రాజీనామా చేశారు
Peddireddy Ramachandra Reddy | ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జడ్పీటీసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. కష్టాల్లో ఉన్న క్యాడర్‌ను అధిష్ఠానం ఆదుకోవడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
కాగా, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదును అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్‌పై కూడా కేసు నమోదు చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ప్రోత్సాహంతో అప్పటి సీబీఐ డీజీ పీవీ సునీల్‌కుమార్, కొందరు అధికారులు వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ కేసులు బనాయించి తనను కస్టడీలోకి తీసుకోవడమే కాకుండా.. హత్యాయత్నం చేశారని తెలిపారు. రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు మేరకు ఏ1గా సునీల్‌కుమార్, ఏ2గా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా వైఎస్ జగన్, ఏ 4గా అప్పటి సీబీఐ ఏఎస్పీ విజయ్‌పాల్, ఐ5గా జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు తదితర అంశాలకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. వీటిలో నాన్‌బెయిలబుల్ సెక్షన్లుకూడా ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

