YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
YS Jagan | ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడినా , ప్రజల మనసులను గెలుచుకుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు.
అమరావతి : ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ( Elections ) తమ పార్టీ ఓడినా , ప్రజల మనసులను గెలుచుకుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan ) తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో చంద్రబాబు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తు ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. అందుకే గెలిచి, నైతికంగా ఓడిపోయారు. తాము ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నామని వెల్లడించారు.
అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చని, కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నాయకులు, కార్యకర్తలు, మహిళలు కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో తమ పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా అచంచల విశ్వాసంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

