ఆ బిడ్డకు తండ్రి ఎవరో.. డీఎన్ఏ టెస్ట్ చేయించమని కోరా: శాంతి భర్త మదన్ మోహన్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వల్లే తన భార్య శాంతికి బిడ్డ పుట్టాడని ఆమె భర్త మదన్ మోహన్ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తన భార్య శాంతియే తనకు చెప్పిందని కూడా తెలిపారు. కాకపోతే లీగల్‌గా ఆ బిడ్డకు తండ్రిగా తన పేరు ఉందని పేర్కొన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వల్లే తన భార్య శాంతికి బిడ్డ పుట్టాడని ఆమె భర్త మదన్ మోహన్ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తన భార్య శాంతియే తనకు చెప్పిందని కూడా తెలిపారు. కాకపోతే లీగల్‌గా ఆ బిడ్డకు తండ్రిగా తన పేరు ఉందని పేర్కొన్నారు. అందుకే ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలని అనుమతి కోరామని చెప్పారు.
విశాఖలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి చూస్తే కేసు షీట్లో పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరు చూసి షాకయ్యాయనని తెలిపారు. కానీ ఆ బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని సుభాష్ చెబుతున్నాడని అన్నారు. శాంతి మాత్రం సుభాష్‌నే తన బిడ్డకు తండ్రి అని చెబుతుందని తెలిపారు. రేపు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలి కదా అని అన్నారు. తండ్రి ఎవరో తెలియకపోతే భవిష్యత్తులో ఆ బిడ్డ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
తనకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని.. తన భార్య మీద అన్యాయంగా అభాండాలు ఎందుకు వేస్తానని మదన్ మోహన్ ప్రశ్నించారు. తనతో బలవంతంగా సంతకం పెట్టించి విడాకులు తీసుకున్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆటలో తాను, శాంతి నలిగిపోతున్నామని తెలిపారు. ఈ వివాదం తర్వాత సుభాష్ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయసాయి రెడ్డి బెదిరింపులకు కారణమా? అని ప్రశ్నించారు. కాగా, శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలని నిన్న హోంమంత్రి వంగలపూడి అనితను మదన్ మోహన్ కోరారు. అన్ని వివరాలు పరిశీలించి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారని మదన్ మోహన్ చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

