టమాట ధరలు ఢమాల్..! రోడ్డుపై టన్నుల కొద్దీ పారబోత
టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. పంట కోసి తీసుకొచ్చినా.. సరైన ధర లేకపోవడంతో మార్కె్ట్లకు రవాణా చేయడం నిలిపి రోడ్లపైనే పారబోశారు. గత నెలలో క్వింటాల్ టమాటా రూ.1000కు విక్రయించగా.. ప్రస్తుతం రూ.300 కూడా...
అనంతపురం జిల్లా : టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. పంట కోసి తీసుకొచ్చినా.. సరైన ధర లేకపోవడంతో మార్కె్ట్లకు రవాణా చేయడం నిలిపి రోడ్లపైనే పారబోశారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాట 2 రూపాయలు పలుకుతున్నది. రాప్తాడు, శింగనమల, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో టమాట సాగు పెద్ద మొత్తంలో జరుగుతున్నది. పంట కోసే స్థితిలో లేకపోవడంతో చాలా మంది రైతులు తమ తోటల్లోకి పశువులను మేతకు అనుమతినిస్తున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు, కల్యాణదుర్గం, కంబదూరు, పేరూరు, కనగానపల్లి మండలాలకు చెందిన రైతులు ఇవాల ఉదయం ఆటో ట్రాలీల్లో టమాట మార్కెట్‌కు చేరుకున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉసూరుమన్నారు. గిట్టుబాటు చెల్లించి పంట కొనాలంటూ హోల్‌సెల్ వ్యాపారులను వేడుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో చేసేదేం లేక మార్కెట్‌కు తీసుకొచ్చిన టన్నుల కొద్దీ పంటను హైవే పక్కనే పారబోశారు.
గత నెలలో క్వింటాల్ టమాటా రూ.1000కు విక్రయించగా.. ప్రస్తుతం రూ.300 కూడా అందడం లేదు. కూలీ చెల్లింపులు అదనపు భారం అవుతుందన్న కారణంతో పలువురు రైతులు టమాటా పంట కోయడం మానేశారు. మార్కెట్లో భారీ స్థాయిలో టమాటా అందుబాటులో ఉండటంతో ధర తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించడం ద్వారా టమాట రైతులను ఆదుకునే వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టమాట కెచప్, సాస్, చిప్స్, జ్యూస్, పల్ప్లను భద్రపరిచి భవిష్యత్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు అనంతపురం జిల్లాలో కనీసం 4 కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, 10 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

