చంద్రబాబు పర్యటనలో అపశృతి.. టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. సోంపల్లి దగ్గర చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. బోటులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. సోంపల్లి దగ్గర చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. బోటులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు. వీరికి పెను ప్రమాదం తప్పింది. ఫుట్పాత్ విరిగిపోవడానికి కొన్ని సెకండ్ల ముందే చంద్రబాబు పంట్లో ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఇవాళ పర్యటించారు. ఆచంట మండలం అయోధ్య లంకలోని లంక గ్రామాన్ని చంద్రబాబు పర్యటించారు. అక్కడ వరద బాధితులతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రాజోలు ప్రయాణంలో సోంపేటకు బయల్దేరారు. గంట ప్రయాణం జరిగిన తర్వాత పడవ ఒడ్డుకు చేరుకున్నది. చంద్రబాబుతోపాటు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ బోటు నుంచి దిగేందుకు ప్రయత్నించారు. పంటిపై చంద్రబాబు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న తర్వాత మిగిలిన నాయకులు, గన్మెన్లు దిగేందుకు ఉద్యుక్తమవుతుండగా ఒక్కసారిగా ఫుట్పాత్ విరిగిపోయింది. దాంతో వారంతా నీటిలో పడిపోయారు. అక్కడ నీరు దాదాపుగా 10 నుంచి 15 అడుగుల వరకు ఉంటుందని స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. పంటి ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో బోట్లోని అంతా నీటిలో పడిపోయినట్లుగా తెలుస్తున్నది.
అక్కడే ఉన్న మత్స్యాకారులు, మిగతా నేతలు వెంటనే తేరుకుని పడవలోని లైవ్జాకెట్లు నీటిలో పడిపోయిన వారికి అందించి ధరించేలా చూశారు. చాలా సేపు నేతలు అలాగే పడవను పట్టుకుని ఉండిపోయారు. కొద్ది సేపటి తర్వాత చిన్న బోట్లను ఏర్పాటు చేసి 10 అడుగుల దూరంలోని ఒడ్డుకు క్షేమంగా తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. గత నాలుగైదు రోజుల క్రితం నాటి ప్రవాహం లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీరికి లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచినప్పటికీ ఎవరూ ధరించలేదని తెలుస్తున్నది. చంద్రబాబు మాత్రం అయోధ్య లంకలో లైఫ్ జాకెట్ ధరించి కనిపించారు. కానీ, సోంపల్లికి చేరుకునే సమయంలో ఆయన కూడా జాకెట్ను తీసేశారు. పడవ బోల్తా పడిన విషయం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పందించి వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ పడవలో 8-10 మంది మాత్రమే ప్రయాణించాలి. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో 10 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో పడవలో ప్రయాణిస్తున్నారు. ఫుట్పాత్ రెయిలింగ్ విరిగిపోయి ఒక పక్కకు ఒరగడంతో పడవ బోల్తా పడిపోయింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

