అమరావతి : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు స్పం దించారు. ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయు డు అన్న నందమూరి తారకరామారావు అని పేర్కొన్నారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోందని, కన్నీరు పెడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు పెడుతూ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీనేతలతో పాటు బీజేపీ, సీపీఐ, జనసేన ,అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్కు స్వయాన సోదరి షర్మిల కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్, ఇవాళ నందమూరి బాలకృష్ణ స్పందించారు.