శ్రీశైల దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తుల నిరసన
కల్యాణకట్ట వద్ద భక్తుల నిరసన | శ్రీశైలం దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తులు నిరసనకు దిగారు. తలనీలాలు సమర్పించేందుకు ఆలయ అధికారులు కల్యాణకట్ట తెరవకపోవడంతో కల్యాణకట్ట ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : శ్రీశైలం దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తులు నిరసనకు దిగారు. తలనీలాలు సమర్పించేందుకు ఆలయ అధికారులు కల్యాణకట్ట తెరవకపోవడంతో కల్యాణకట్ట ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుదూరం నుంచి భక్తులు మొక్కు చెల్లించేందుకు వస్తే కల్యాణకట్టను మూసివేయటం ఏంటని, వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. తలనీలాల సమర్పణకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆలయ అధికారులు అక్కడికి చేరుకొని భక్తులకు సర్దిచెప్పి నిరసన విరమింపజేశారు. కొవిడ్ దృష్ట్యా గత నెల కల్యాణకట్టను ఆలయ అధికారులు మూసివేశారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయడం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం నేటి నుంచి కర్ఫ్యూవేళలను సడలించడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

