Tirumala| తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వడ్డీ కాసుల వాడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు (Compartment) నిండిపోయాయి.
తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వడ్డీ కాసుల వాడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు (Compartment) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 66,162 మంది భక్తులు దర్శించుకోగా 27,668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చిందని తెలిపారు.
డిసెంబర్ 11న వైజాగ్ లో కార్తిక దీపోత్సవం
కార్తిక మాసం సందర్భంగా డిసెంబర్ 11న వైజాగ్ లో దాతల సహకారంతో కార్తిక దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. కార్తిక దీపోత్సవంలో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన రికార్డింగ్ పనుల కోసం ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ సహకారం తీసుకోవాలని సూచించారు. ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

