ఎన్టీఆర్ జిల్లాలో జోరుగా నకిలీ నోట్ల దందా.. ముఠా గుట్టురట్టు
విసన్నపేట మండలం పుట్రేల వద్ద నకిలీ నోట్ల ముఠా పట్టుబట్టింది. వారి వాహనాలను తనిఖీ చేయగా 47 లక్షలకు పైగా విలువచేసే నకిలీ నోట్లు...
ఎన్టీఆర్ : జిల్లాలో నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతున్నది. గత కొన్నాళ్లుగా నకిలీ నోట్లు ఎక్కడ పడితే అక్కడ వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు, దుకాణదారులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా విసన్నపేట మండలం పుట్రేల వద్ద నకిలీ నోట్ల ముఠా పట్టుబట్టింది. వారి వాహనాలను తనిఖీ చేయగా 47 లక్షలకు పైగా విలువచేసే నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఏసీపీ ప్రసాద్ మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
పుట్రేల వైపునకు వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. రెండు బ్యాగులు బయటపడ్డాయి. వీటిని ఓపెన్ చేయగా కళ్లు బైర్లు కమ్మేలా డబ్బు కట్టలు బయటపడ్డాయి. తొలుత వాటిని చూస్తే అవి నకిలీవి అని ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, పరిశీలించి చూడగా నకిలీవని తేలాయి. నిందితుల నుంచి 47.50 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మేకతోటి శశికిరణ్, గాలి రత్నం బాబు, పగిడిపల్లి గణేష్, తోట నరసింహారావులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు. అలాగే, ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

