Chandra Babu | ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను ప్రయోగం విజయవంతం పట్ల సీఎం చంద్రబాబు అభినందనలు
Chandra Babu | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్నుప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
SSLV-D3 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను (SSLV-D3 Rocket ) ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu ) శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారతదేశ అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందని అన్నారు. ఇస్రో బృందం భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు.
శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయటం, అందుకు అనుకూలమైన పేలోడ్ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
‘ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్’ ఈవోఎస్-08ను (EOS-08 mission) తక్కువ ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్ లక్ష్యం. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపడుతున్న రాకెట్ ప్రయోగమిది. కేవలం రెండు రోజుల ప్రణాళికతో చిన్న చిన్న శాటిలైట్స్‌ను తక్కువ ఖర్చుతో భూ కక్ష్యలోకి చేర్చేందుకు ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్‌తో సాధ్యమవుతుందని ఇస్రో అధికారులు వివరించారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ (ISRO Chairman Somnath) వెల్లడించారు.
పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈవోఎస్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ (ఈవోఐఆర్) పెలోడ్ మిడ్-వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రా-రెడ్‌లో చిత్రాలను క్యప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుందని ఇస్రో పేర్కొంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

