వరద తగ్గడంతో శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేత
Srisailam project|శ్రీశైలం జలాశయానికి వరద తగ్గడంతో అధికారులు గేట్లను మూసివేశారు. ఇవాళ ఉదయం 10 గంటల వరకు ఒక గేటు ద్వారా నీటి విడుదల చేసిన
అమరావతి : శ్రీశైలం జలాశయానికి వరద తగ్గడంతో అధికారులు గేట్లను మూసివేశారు. ఇవాళ ఉదయం 10 గంటల వరకు ఒక గేటు ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు వరద ప్రవాహం తగ్గడంతో ఒక గేటును కూడా మూసివేశారు.76,294 క్యూసెక్కుల నీరు వస్తుండగా కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,567 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా 26,560 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల, సుంకేశుల నుంచి 24,968 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది . శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881,70 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. పూర్తిస్థాయి నీటి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు 197.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు 62, 638 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గోదావరిలో క్రమంగా గోదావరి ప్రవాహం తగ్గుతుండడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. 5,200 క్యూసెక్కుల నీటిని పంట కాల్వలకు , 8.58 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురి సిన వర్షాలకు జలాశయానికి 4,622 క్యూసెక్కుల వరద వస్తుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సోమశిల జలాశయం పూర్తి నీటి నిల్వ 78 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 56 టీఎంసీలు గా ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

