Chandra Babu | రేపు సాయంత్రం చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ.. మెగా డీఎస్సీపై తొలి సంతకం
Chandra Babu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు (Chandra Babu) రేపు బాధ్యతలు(Charge) చేపట్టనున్నారు. విజయవాడ సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్ ఛాంబర్లో సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ (Mega DSC ) పై తొలి సంతకం చేయనున్నారు. రెండో సంతకం ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్(Land Title Act) రద్దుపై, మూడో సంతకం పెన్షన్లు(Pensions) రూ. 4 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఆయన ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేయనున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం రెండో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇవాళ విజయవాడలోని కేసరపల్లిలో ఏర్పాటుచేసిన వేదిక పై ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో పాటు పవన్‌కల్యాణ్, మరో 23 మంది కూటమి సభ్యులతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజినీకాంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

