Tirumala | ఘనంగా చక్రస్నానం.. నేటితో ముగియనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు వేదపండితులు ఘనంగా చక్రస్నానం నిర్వహించారు.
తిరుమల: తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు వేదపండితులు ఘనంగా చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు శ్రీవారు, ఉభయ దేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు టీటీడీ అధికారులు అనుమతించారు. గోవింద నామస్మరణతో తిరుమల కొండలు మారుమోగాయి. కాగా మంగళవారం రాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ముగియనున్న బ్రహ్మోత్సవాలు
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఎనిమిదో రోజైన సోమవారం ఉభయ దేవేరుల సమేత శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. నాలుగు గంటలపాటు సాగిన రథోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. మొత్తం 66,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25,103 మంది తలనీలాలను సమర్పించారు.
నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం 3 నుంచి 5 గంటల సమయం పడుతున్నది. హుండీ ద్వారా రూ.3.88 కోట్ల ఆదాయం టీటీడీకి అందింది. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బోర్డు సభ్యులు, అధికారులు పా ల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని టీటీడీ చైర్మన్ చెప్పారు.
సోమవారం రాత్రి అశ్వవాహన సేవ సందర్భం గా ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లల్లో భక్తిభావం పెంపొందించడానికి టీటీడీ ప్రారంభించిన ‘గోవింద కోటి’ రాసి యువత తరించాలని ఆయన పిలుపునిచ్చారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఆయన సతీమణి టీటీడీ బోర్డు మెంబర్ సీతారెడ్డి రథాన్ని లాగారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

