Amaravati | అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం
Amaravati | వైసీపీ హయాంలో నిలిచిపోయిన అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణ పనులు శనివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.
అమరావతి : వైసీపీ హయాంలో నిలిచిపోయిన అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణ పనులు శనివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) ఈమేరకు తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఆర్డీఏ (CRDA) కార్యాలయ పనులను ప్రారంభించారు. 2017లో రూ. 160 కోట్లతో సీఆర్డీఏ పనులను ప్రారంభించగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ(YCP) ఆ పనులను నిలిపివేసింది.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి కోసం 54 వేల ఎకరాలు సేకరించామని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిచ్చారని కొనియాడారు. అమరావతి రాజధాని కోసం 5 సంవత్సరాల పాటు నిరంతరం ఆందోళనలు చేపట్టిన రైతులు, మహిళలు, ప్రజలను అభినందించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని లేకుండా అనేక అడ్డంకులు చేసిందని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమరావతే రాజధానిగా ఉంటుందని , రెండో మాట లేదని స్పష్టం చేశారు. విశాఖ ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూల్లో హైకోర్టు బెంచ్, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అమరావతి చుట్టూ 180 కిలోమీటర్లు రింగు రోడ్డును నిర్మించబోతున్నామని, రాజధాని ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను నెలకొల్పబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

