Road Accident : రెండు బైకులు ఢీకొని ముగ్గురు దుర్మరణం
Road Accident | కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

అమరావతి : కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట మండలం మందరం గ్రామశివారులో ఈ సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంలో రెండు బైకులపై ప్రయాణిస్తున్న తండ్రీకుమార్తెతోపాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

