AP News | పెద్దిరెడ్డికి భారీ షాక్.. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ సహా 12 మంది టీడీపీలోకి జంప్!
AP News | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీం బాషా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు
AP News | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీం బాషా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. రాజీనామా అనంతరం అలీం బాషా మీడియాతో మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమే ఉంటుందని.. అధికారం ఆయన చేతుల్లోనే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, పుంగనూరు మున్సిపాలిటీని సొంతం చేసుకునేందుకు ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు వ్యూహం పన్నారు. వైసీపీలో పెద్దిరెడ్డి ఆధిపత్యంతో అసంతృప్తిలో ఉన్న మున్సిపల్ ఛైర్మన్ అలీం బాషాతో పాటు మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లను తనవైపునకు ఆకర్షించారు. దీంతో ఆయన ప్రలోభాలకు లొంగిన 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మొత్తం 31 మంది సభ్యులు ఉన్న పుంగనూరు మున్సిపాలిటీలో ఇప్పటికే 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా.. మరికొంత మంది కూడా త్వరలోనే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. దీంతో మెజారిటీ సీట్లతో టీడీపీ పుంగనూరు మున్సిపాలిటీని దక్కించుకుంటుంది.
కాగా, వైసీపీకి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రాజాపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మండలి చైర్మన్ మోషెన్ రాజు, విప్ పాలవలస విక్రాంత్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.
పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజుకు.. విప్ పాలవలస విక్రాంత్ ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజును అనర్హుడిగా ప్రకటిస్తూ ఈ నెల 3వ తేదీన మండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే చైర్మన్ నిర్ణయాన్ని రఘురాజు తప్పుబట్టారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రఘురాజు పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ సతీమణి టీడీపీలో చేరారనే కారణంతో పార్టీ ఫిరాయింపుల కింద ఆయన్ను అనర్హుడిగా ప్రకటించారని వైసీపీ తరఫున సీనియర్ లాయర్ జంధ్యాల రవిశంకర్ హైకోర్టుకు వివరించారు. ఎమ్మెల్సీ సతీమణి తీసుకున్న నిర్ణయానికి పిటిషనర్‌ను బాధ్యుణ్ని చేయడం సరికాదని రఘురాజు తరఫున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రఘురాజు స్థానాన్ని ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

