Badvel by election | బద్వేల్లో అధికార వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా నాలుగో రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఆధిపత్యంలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ ముగిసేసరికి వైసీపీ 30,412 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్లో వైసీపీకి 10,184 ఓట్లు రాగా.. బీజేపీకి 2,305, కాంగ్రెస్కు 598, నోటాకు 393 ఓట్లు పోలయ్యాయి.