Badvel by election | 90 వేలకు పైగా మెజారిటీతో వైసీపీ విజయం

Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90వేలకు పైగా మెజారిటీతో ఘన సాధించారు. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 90,228 ఓట్ల మెజారిటీని సాధించారు. గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో తన భర్త కంటే దాదాపు రెట్టింపు మెజారిటీని సాధించారు. దాసరి సుధకు మొత్తం 1,11,710 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 21,621 ఓట్లు, కాంగ్రెస్‌కు 6,205 ఓట్లు, నోటాకు 3,622 ఓట్లు పోలయ్యాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి దాసరి వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వైసీపీ అధిష్టానం.. బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా దాసరి సుధను ఎంపిక చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
Kazipet Land Scam | 4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు.. కాజీపేటలో 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై పంజా
Paddy Procurement | ఎక్కడి ధాన్యం అక్కడే.. వడ్ల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం.. కల్లాల్లో కుప్పలు పోసి పడిగాపులు కాస్తున్న రైతన్నలు
Revanth Reddy | కాళేశ్వరం మూడో టీఎంసీపై తొందరొద్దు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
Horoscope | 11-11-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

