Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీ సాధించారు. గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో తన భర్త మెజారిటీ బీట్ చేశారు. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 89,660 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇంకా ఒక్క రౌండ్ మాత్రమే మిగిలి ఉండటంతో వైసీపీ గెలుపు లాంఛనమైపోయింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి దాసరి వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వైసీపీ అధిష్టానం.. బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా దాసరి సుధను ఎంపిక చేసింది.