ఎట్టకేలకు శ్రీకాళహస్తి ఆలయానికి ట్రస్ట్ బోర్డు
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైంది. సరిగ్గా మహాశివరాత్రి రోజున పాలక మండలి కొలువుదీరింది. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అనుచరుడు అంజూరు తారక శ్రీనివాసులును...
తిరుపతి: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైంది. సరిగ్గా మహాశివరాత్రి రోజున పాలక మండలి కొలువుదీరింది. పాత బోర్డు పదవీకాలం ముగియడంతో 2017 సెప్టెంబర్ నుంచి ఆలయానికి పాలక మండలి లేదు. 16 మంది సభ్యులతో కూడిన బోర్డును ప్రభుత్వం నియమించి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అనుచరుడు అంజూరు తారక శ్రీనివాసులును పాలక మండలి ఛైర్మన్‌గా ఖరారు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం 2021 జూలైలో ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా సత్యవేడు నియోజకవర్గానికి చెందిన బీరేంద్ర వర్మ ఒక్కరి పేరునే ప్రకటించింది. దాంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది. సాధారణంగా బోర్డు ఛైర్మన్ పదవికి అభ్యర్థిని శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచే ఎంపిక చేస్తారు. అయితే, సత్యవేడుకు చెందిన బీరేంద్ర వర్మ పేరును ప్రకటించడంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాలక మండలి నియామకం కాస్తా నిలిచిపోయింది. చివరకు మహా శివరాత్రిని పురస్కరించుకుని మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తిని మన్నించిన వైసీపీ ప్రభుత్వం.. ఈ మేరకు పాలక మండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ఛైర్మన్ ఎవరనేది స్పష్టం చేయనప్పటికీ.. ఎమ్మెల్యే మధుసూదన్ తన అనుచరుడు తారక శ్రీనివాసులు వైపు మొగ్గు చూపారు. దాంతో తారక శ్రీనివాసులు బోర్డ్ చైర్మన్‌గా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.
దాదాపు రూ.120 కోట్ల వార్షిక బడ్జెట్‌తో దేవస్థానానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన కొత్త బోర్డును నియమించేందుకు గత టీడీపీ ప్రభుత్వంగానీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గానీ ఆసక్తి చూపలేదు. వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు పూజ సామాగ్రి సేకరణ, తాత్కాలిక నియామకాలు, ఇతర విషయాలతోపాటు ఆలయ నిర్వహణకు సంబంధించిన పలు అంశాల్లో అక్రమాలు జరిగాయని పలువురు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుడు తారక శ్రీనివాసులు ఎలా నెగ్గుకొస్తారని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

