Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
Violence In Cinema | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఒక అత్యంత అరాచకమైన సంఘటన విద్యాలోకాన్ని, సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఒక అత్యంత అరాచకమైన సంఘటన విద్యాలోకాన్ని, సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రాప్తాడు జెడ్పీ హైస్కూల్లోని ఒక తరగతి గదిలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల సమక్షంలోనే పదవ తరగతి విద్యార్థినిపై చెట్లు నరికే గొడ్డలి (చైన్ సా)తో ఒక దుండగుడు దాడికి పాల్పడిన వైనం ప్రతి ఒక్కరి గుండెలను కలచివేసింది. ఈ దారుణ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా, మరొకరిని రక్షించబోయి మరో విద్యార్థిని కూడా గాయపడ్డారు. పాఠశాల వంటి ప్రదేశంలో, అది కూడా క్లాస్‌రూమ్‌లో ఇలాంటి భయానక హింస చోటుచేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఉదంతం నేపథ్యంలో ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. నేటి ఆధునిక చలనచిత్రాల్లో ప్రదర్శించబడుతున్న మునుపెన్నడూ లేని క్రూరత్వం, విపరీతమైన హింస, రివెంజ్ డ్రామాలు యువతను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయనే కోణంపై తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతోంది. ఒక బాలీవుడ్ చిత్రంలో కథానాయకుడు తరగతి గదిలోకి తుపాకీతో ప్రవేశించే సన్నివేశం కావచ్చు, లేదా ఇతర చిత్రాల్లోని హింసాత్మక సన్నివేశాలు కావచ్చు.. ఇలాంటి విజువల్స్ పిల్లల అపరిపక్వ మైండ్స్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమా కేవలం వినోదం అనే పరిధిని దాటి, నేర ప్రవృత్తిని సాధారణీకరించేలా మారుతోందా అనే ప్రశ్న ఇప్పుడు మేధావుల నుండి తల్లిదండ్రుల వరకు అందరినీ వేధిస్తోంది.
వినోద రంగంలో క్రియేటివిటీ పేరుతో తెరపై ప్రదర్శించే అతి హింస, హత్యలు, దాడులు నేరస్థులకు ఒక మానసిక ప్రేరణగా మారుతున్నాయా? బాధ్యతారహితమైన పాత్రల చిత్రణ యువత ఆలోచనా విధానాన్ని ఏ దిశగా నడిపిస్తోంది? అనే ప్రశ్నలకు సినీ ప్రముఖులు, దర్శకులు, నటులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాల్సిన మాధ్యమాలు, నేరాలకు దారితీసే మార్గదర్శకాలుగా మారడం అత్యంత ప్రమాదకరం.
ఈ అరాచక ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతో పాటు, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. అయితే, కేవలం చట్టపరమైన చర్యలతోనే సరిపోతుందా? ఇలాంటి హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటే చలనచిత్ర సెన్సార్ బోర్డు నుంచి మొదలుకొని, సమాజంలోని ప్రతి వేదికపై హింసను మహిమపరచడాన్ని నిరోధించే గట్టి ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ విషయంలో సినిమాలను మాత్రమే తప్పుబట్టలేం సినిమాలు ఎక్కువగా లేని కాలంలో కూడా ఇలాంటి దారుణ ఘటనలు జరిగిన రోజులున్నాయి. అయితే ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు చర్చించవలసిన అంశం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

